Site icon TeluguMirchi.com

Shankar – AR Murugadoss: ఇండియన్ సినిమా హిస్టరీలోనే కళ్లు చెదిరే బిగ్గెస్ట్ కొలాబరేషన్!

Shankar

Shankar – AR Murugadoss: స్టార్ డైరెక్టర్లు ఎస్.శంకర్ – ఎ.ఆర్.మురుగదాస్ కాంబోలో ఒక భారీ చిత్రం తెరకెక్కుతుందున్న వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా కథనాల ప్రకారం.. ఈ చిత్రానికి ఎ.ఆర్.మురుగదాస్ పవర్‌ఫుల్ స్టోరీని అందించనుండగా, లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ స్పెషలిస్ట్ ఎస్.శంకర్ దీనికి డైరెక్షన్ వహించనున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇద్దరు టాప్ డైరెక్టర్స్ ఇలా ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్, అద్భుతమైన సాంకేతికత, సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. మరోవైపు మురుగదాస్ కూడా సమాజంలో జరిగే అంశాలను కమర్షియల్ యాక్షన్ డ్రామాగా మలచడంలో సిద్ధహస్తుడు. మురుగదాస్ మార్క్ ఇంటెన్స్ స్క్రిప్ట్‌కు, శంకర్ మార్క్ గ్రాండ్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల తుఫాను ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ ‘వేల్పారి’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారని సమాచారం. మురుగదాస్ ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి ఒక స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొనడం, శంకర్ రైటింగ్ టీమ్‌తో మురుగదాస్ చర్చలు జరపడం వంటివి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన హీరో ఎవరు? ఏ నిర్మాణ సంస్థ నిర్మించబోతోంది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కలయికపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ ఇద్దరు దిగ్గజాల కాంబో గురించిన వార్త వినడమే ఇటు సినీ ప్రియులకు, అటు ట్రేడ్ వర్గాలకు భారీ హైప్‌ను ఇస్తోంది.

Exit mobile version