Site icon TeluguMirchi.com

Shine Screens: బాసిల్ జోసెఫ్ హీరోగా షైన్ స్క్రీన్స్ క్రేజీ ప్రాజెక్ట్!

Cinema (2)

Shine Screens: టాలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో సినిమాలను నిర్మిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ఇప్పుడు మలయాళ చిత్ర సంచలనాలను సృష్టించేందుకు రెడీ అవుతుంది. నిర్మాత సాహు గారపాటికి చెందిన ఈ బ్యానర్.. మలయాళ స్టార్ నటుడు బాసిల్ జోసెఫ్ హీరోగా ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల షైన్ స్క్రీన్స్ నిర్మించిన మలయాళ చిత్రం ‘వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు వంద కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఈ చిత్రానికి సావిన్ ఎస్.ఏ. దర్శకత్వం వహించగా, విపిన్ దాస్ స్టోరీని అందించారు. అజిన్ జాయ్, వినాయక్, హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘వాలా 2’ పేరుతో విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది.

ఇప్పుడు అదే జోష్‌తో షైన్ స్క్రీన్స్ మలయాళంలో బాసిల్ జోసెఫ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాకు వాజా దర్శకుడు విపిన్ దాస్‌కు చెందిన అసోసియేట్ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుందని తెలుస్తోంది. బాసిల్ జోసెఫ్‌కు నటుడిగా ఈ సినిమా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కానుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌ను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. నటుడిగా బిజీగా ఉంటూనే దర్శకుడిగానూ తన ప్రతిభను చూపించేందుకు బాసిల్ సిద్ధమవుతున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణ భాగస్వామ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే మలయాళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాసిల్ జోసెఫ్ క్రేజ్, విపిన్ దాస్ టీమ్ అనుభవం, షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version