Site icon TeluguMirchi.com

Telusu Kada : సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 17న గ్రాండ్ రిలీజ్

Telusukada
Telusu Kada : ‘మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తయింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి మరియు రాశి ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇటివలే విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించగా, మొదటి పాట ‘మల్లిక గంధ’ చార్ట్‌బస్టర్‌గా నిలిచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. త్వరలోనే రెండో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. ఇక సెన్సేషనల్ కంపోజర్ తమన్ మ్యూజిక్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ VS లావిష్ విజువల్స్‌ను అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కాస్ట్యూమ్స్‌ శీతల్ శర్మ. ‘తెలుసు కదా’ అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.

Exit mobile version