Site icon TeluguMirchi.com

Singh Geetham Movie: ‘సింగ్ గీతం’ సినిమాకు సెన్సార్ క్లీన్ ‘U’ సర్టిఫికేట్.. జూన్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్న సినిమా!

Singh Geetham Movie

Singh Geetham Movie: టాలీవుడ్‌లో సరికొత్త వైబ్‌తో థియేటర్లలోకి రావడానికి రెడీ అవువుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సింగ్ గీతం’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘U’ (యూనివర్సల్) సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘U’ సర్టిఫికేట్ రావడంతో ఈ సినిమాను అన్ని వయసుల వారు, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లలో హ్యాపీగా కలిసి చూసేందుకు మార్గం సుగమమైంది. సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా నిడివిని 137 నిమిషాలు (2 గంటల 17 నిమిషాలు) గా లాక్ చేశారు. నేటి కాలంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్ టైమ్ అని చెబుతున్నారు.

రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్!
ఈ చిత్రాన్ని థియేటర్లలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించడానికి బోర్డు అనుమతిని ఇచ్చింది. జూన్ 9న ఈ అధికారిక సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సింగ్ గీతం’ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సెన్సార్ సర్టిఫికేట్ బయటకు వచ్చినప్పటి నుంచి సినీ లవర్స్, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ సర్టిఫికేట్ వివరాలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంతో, ఈ చిత్రాన్ని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Exit mobile version