
Rishab Shetty : వైవిధ్యభరితమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరో భారీ సినిమాకు శ్రీకారం చుట్టింది. ‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తో ఓ ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం కథ 18వ శతాబ్దం నాటి అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్ నేపథ్యంగా సాగుతుంది. తిరుగుబాటును నడిపించిన ఓ నాయకుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడే ఈ చిత్రానికి, ప్రతిభాశాలి దర్శకుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘కాంతార 2’లో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి, ఈ కొత్త చిత్రంతో మరోసారి ప్రేక్షకులను విభిన్నమైన కథతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటనతోనే ఆసక్తిని రేపిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Not all Rebels are forged in Battle. ⚔️
Some are chosen by Destiny
And this is that story of a Rebel..💥💥Proudly announcing @SitharaEnts Production No.36 with the versatile and dynamic @shetty_rishab garu. 🔥🔥
Directed by @AshwinGangaraju
Produced by @vamsi84 &… pic.twitter.com/QTP36Bo4s4
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2025
