Site icon TeluguMirchi.com

Mrunal Thakur : రివ్యూలను నమ్మొద్దు.. మీరే చూసి నిర్ణయం తీసుకోండి

Mrunal
Mrunal Thakur : ప్రస్తుతం సినిమా విడుదలైతే చాలు, యూట్యూబ్ రివ్యూలు, ట్విట్టర్ కామెంట్లు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో ‘మైండ్ బ్లాక్’ అంటూ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు ఇస్తున్న ట్రెండ్ మరింత పెరిగింది. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు అర్థం చేసుకునేలోపే ‘ఫ్లాప్’, ‘ఓవరాక్షింగ్’, ‘బోర్’ అంటూ ట్యాగ్‌లు కట్టి, ప్రేక్షకుల అభిప్రాయాలను దారి తప్పిస్తున్నారని పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే మండిపడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ కూడా ఈ అంశంపై ఘాటైన స్పందన ఇచ్చింది.

ఇటీవల మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించిన ఆమెను ఒక అభిమాని ఇలా కామెంట్ చేశాడు: “నేను నెగటివ్ రివ్యూలు చూసి సినిమా చూడలేదు.” దీనిపై మృణాల్ సూటిగా స్పందిస్తూ, “చాలా రివ్యూలు తప్పుదారి పట్టించేలా ఉంటున్నాయి. అందుకే రివ్యూలను నమ్మకుండా, మీరే సినిమా చూసి అభిప్రాయం ఏర్పరచుకోవాలి. చాలా సార్లు సినిమాల ఫెయిల్యూర్కి ఈ రివ్యూలే కారణం అవుతాయి,” అని స్పష్టం చేసింది.

ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇండస్ట్రీలో కూడా చాలా మంది నిపుణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. “రివ్యూల ఆధారంగా నిర్ణయం తీసుకుంటే, సినిమా ఆత్మను చూడకముందే దాన్ని ఖండించినట్టే అవుతుంది,” అని వారు అంటున్నారు. అయినప్పటికీ, ఈ ట్రెండ్ ఆగేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మృణాల్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది.

Exit mobile version