
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్‌లో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పటికే 50 రోజులకు పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమా కథకు తగ్గట్టుగా భారీ స్కేల్‌లో యాక్షన్ సన్నివేశాలు, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పటికీ.. నిర్మాణ వ్యయం విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రొడక్షన్ ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సినిమాకు అవసరం లేని ఖర్చులను తగ్గించుకుంటూ.. కథ, పాత్రలు, యాక్షన్, విజువల్స్ వంటి కీలక అంశాలకు మాత్రమే భారీగా ఖర్చు చేస్తున్నారట. షూటింగ్ ప్లానింగ్‌ను ముందుగానే పక్కాగా సిద్ధం చేసుకోవడం ద్వారా అనవసరమైన ఆలస్యాలు, అదనపు వ్యయాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ సినిమాల్లో సాధారణంగా కనిపించే ఖర్చుల పెరుగుదలను ‘స్పిరిట్’ విషయంలో అదుపులో ఉంచేందుకు యూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ను అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్న ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా సాగుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కథకు అవసరమైన ఎలిమెంట్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందిస్తున్నారట. అంబిషన్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కుతూనే.. బడ్జెట్‌ను కంట్రోల్‌లో ఉంచగలిగితే ‘స్పిరిట్’ ఇండియన్ సినిమా చరిత్రలో అరుదైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బడ్జెట్‌కు సంబంధించిన అధికారిక వివరాలను మేకర్స్ వెల్లడించాల్సి ఉంది.
