Site icon TeluguMirchi.com

Sreeleela: ఒక్క పోస్ట్‌కు అన్ని లక్షలా? శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Sreeleela

Sreeleela: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియా వేదికగానూ ఈ ముద్దుగుమ్మ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య 1.7 కోట్లు (17 మిలియన్లు) దాటిపోవడం విశేషం. ఈ భారీ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ప్రముఖ బ్రాండ్లు శ్రీలీల వెనక క్యూ కడుతున్నాయట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీలీల తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసే ఒక్కో ప్రమోషనల్ లేదా స్పాన్సర్డ్ పోస్ట్‌కు భారీగానే వసూలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లేదా రీల్ కోసం ఆమె ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బ్రాండ్, ప్రమోషన్ పరిధిని బట్టి ఈ ధర మారుతుందని సమాచారం.

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన శ్రీలీలకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటోలు నిమిషాల్లోనే వైలర్ అవుతుంటాయి. ఈ పాపులారిటీ వల్లే కార్పొరేట్ కంపెనీలు, బ్యూటీ ప్రొడక్ట్స్, దుస్తుల బ్రాండ్లు ఆమెతో ప్రమోషన్స్ చేయించడానికి మొగ్గు చూపుతున్నాయట. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, ఇలా సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఈ క్రేజీ బ్యూటీ కోట్లలో సంపాదిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version