Site icon TeluguMirchi.com

Sreeleela: బాలీవుడ్‌లోకి శ్రీలీల గ్రాండ్ ఎంట్రీ.. రిలీజ్ డేట్ లాక్!

Sreeleela

Sreeleela: టాలీవుడ్‌లో తనదైన ఎనర్జిటిక్ డ్యాన్సులు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన క్రేజీ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు నార్త్ బాక్సాఫీస్‌పై కన్నేశారు. దక్షిణాదిలో అగ్ర హీరోల సరసన వరుస విజయాలు అందుకున్న ఈ టాలెంటెడ్ కథానాయిక, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తిక్ ఆర్యన్‌తో జతకడుతూ హిందీ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుని అధికారిక ప్రకటనతో రంగంలోకి దిగింది.

ఇంకా పేరు ఖరారు చేయని ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాను వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. “మీ హృదయాల్లో చిరకాలం నిలిచిపోయే ఓ సరికొత్త ప్రేమకథ.. త్వరలోనే వెండితెరపై ఆవిష్కృతం కానుంది” అంటూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.

ప్రేమకథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతం కలగలిసిన ప్యూర్ లవ్ స్టోరీగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కథలో తన పాత్ర ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్ట్‌లను ఎంచుకునే శ్రీలీల, ఈ సినిమాతో బాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ క్రేజ్, శ్రీలీల గ్లామర్ అండ్ యాక్టింగ్ కలయికలో రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version