Site icon TeluguMirchi.com

Srinivasa Mangapuram: జూలై 30న వెండి తెరపై ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ ప్యూర్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

జూలై 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా వెల్లడించింది. ఈ సినిమాలో జయకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథలో కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్లు, ‘మంగా మంగా’ వంటి సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాకు వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ (జెమిని కిరణ్) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. జూలై 30న థియేటర్లలో ఈ ఇంటెన్స్ లవ్ డ్రామా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version