
Srinivasa Mangapuram: సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని, మహేష్ బాబు ఇమేజ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో కొత్త వారసుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘శ్రీనివాస మంగాపురం’. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ప్రేమలోని సరికొత్త ఎమోషన్స్, హద్దులు లేని యాక్షన్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు సిద్ధమైన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్ర అధికారిక ట్రైలర్‌ను జులై 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథలో జయకృష్ణ మాస్ యాక్షన్ లుక్, రాషా గ్లామర్ ఇప్పటికే టీజర్ ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసందే. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సమర్పణలో, సి.కె. పిక్చర్స్, ఆనంది ఆర్ట్స్ కాంబినేషన్‌లో జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఘట్టమనేని అభిమానులతో పాటు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
