
Varanasi: పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌లో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi). దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి – సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌పై జక్కన్న తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘వెరైటీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి సినిమా ప్రొడక్షన్ స్టేటస్‌పై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోందని చెప్పారు. “మేము ఇప్పటికే షూటింగ్‌లో చాలా ప్రధాన భాగాన్ని పూర్తి చేశాం. సినిమాలోని అత్యంత కీలకమైన, భారీ విజువల్ స్పెక్టకిల్ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ అంతా విజయవంతంగా ముగిసింది” అని స్పష్టం చేశారు. దీంతో ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌లోని మేజర్ టాస్క్ పూర్తయినట్లయింది.
మిగిలిన షూటింగ్ షెడ్యూల్స్ గురించి జక్కన్న మాట్లాడుతూ.. “ప్రస్తుతం మేము కథను అనుసంధానించే చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణపై దృష్టి పెట్టాం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు లేదా అక్టోబర్ మొదటి వారం నాటికి ‘వారణాసి’ సినిమా మొత్తం షూటింగ్‌ను పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు. రాజమౌళి ఇచ్చిన ఈ క్లారిటీతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కానుండటంతో, మిగిలిన సమయాన్ని విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పనుల కోసం కేటాయించనున్నారని సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
We have completed a major portion of the shoot all the important big spectacle action sequences are done.
We are now into doing the smaller, interconnecting scenes so hopefully, by September, maybe a little bit into October, we should be finishing shooting.…
— Varanasi (@VaranasiMovie) June 26, 2026
