Site icon TeluguMirchi.com

Stunt Master : షూటింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మాస్టర్..

Raju
Stunt Master : తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎం. రాజు షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్‌లో హై రిస్క్ స్టంట్ చేస్తుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై హీరో విశాల్, స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా, ఇతర సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రాజు తన సినిమాల్లో కూడా పని చేసిన స్టంట్ మాస్టర్ అని విశాల్ భావోద్వేగంతో తెలిపారు. అతని ధైర్యం, డెడికేషన్ సినిమాలకు ఎంతో బలం చేకూర్చిందని, ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి అన్ని విధాల సహాయంగా ఉంటానని విశాల్ హామీ ఇచ్చారు. ఇకపోతే ఈ ఘటనపై నెటిజన్లు దర్శకుడు పా. రంజిత్, నటుడు ఆర్య నుంచి ఇంకా స్పందన రాకపోవడాన్ని విమర్శిస్తున్నారు. షూటింగ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిపై కనీసం సానుభూతి కూడా తెలియజేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు. అనేక చిత్రాలకు స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన రాజు, తన డెడికేషన్‌కి, సాహసానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో తమిళ సినీ పరిశ్రమ ఓ అద్భుతమైన టాలెంట్‌ను కోల్పోయిందన్న విషాదం పరిశ్రమ మొత్తాన్ని కుదిపేసింది.

Exit mobile version