
Jatadhara : సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రం హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఇటీవల విడుదలైన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అవ్వడం, సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు.
‘జటాధర’ సినిమాను నవంబర్ 7, 2025న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సీబీఓ ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ, “జటాధర సాధారణ సినిమా కాదు, ఇది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. స్కేల్, స్టోరీటెల్లింగ్, విజన్ పరంగా ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది” అన్నారు. డైరెక్టర్స్ అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమా ఫోక్ టేల్ నుంచి ప్రేరణ పొందిన అద్భుతమైన కథ. డివైన్ పవర్, కాస్మిక్ డెస్టినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోందని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ లాంటి అద్భుత తారాగణం స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారు.
From the depths of darkness, the divine rises 💫#Jatadhara in theatres from Nov 7th 2025 in Telugu & Hindi 🪔 #JatadharaOnNOV7 🔱#Awakeningbegins#UmeshKrBansal #PrernaArora @zeestudiossouth @shivin7 #ArunaAgarwal #ShilpaSinghal @kejriwalakshay #RaveenaDeshpaande… pic.twitter.com/306nRa6jYP
— Zee Studios (@ZeeStudios_) September 15, 2025
