Site icon TeluguMirchi.com

Jatadhara : అద్భుతంగా సుధీర్ బాబు ‘జటాధర’ ఫస్ట్ లుక్.. టీజర్ ఎప్పుడంటే?

Jatadhara
Jatadhara : జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా, ఎస్‌కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న మైథికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను అత్యాధునిక గ్రాఫిక్స్‌తో, విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో శివ తత్వాన్ని ప్రతిబింబిస్తూ త్రిశూలం ఆకాశాన్ని చీల్చుతూ వచ్చే దృశ్యం, యుద్ధానికి సిద్ధంగా ఉన్న సుధీర్ బాబు, అతని వెనక భయానకమైన శివుడి రూపం సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెంచాయి. మానవత్వం వర్సెస్ దైవత్వం, శాపం వర్సెస్ శక్తి మధ్య సాగనున్న ఈ కథను ఆసక్తికరంగా మలిచారు. ఈ చిత్ర టీజర్ ఆగస్ట్ 8, 2025న విడుదల కానుంది.

ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతాన్ని జీ మ్యూజిక్ కో అందిస్తోంది. ఈ ప్రాజెక్టును ఉమేష్ కుమార్ బన్స్‌ల, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా కలిసి నిర్మిస్తుండగా, సహ నిర్మాతలుగా అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా పనిచేస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా దివ్య విజయ్ వ్యవహరిస్తున్నారు. ప్రెర్నా అరోరాకి ఇది జీ స్టూడియోస్‌తో రెండవ భారీ ప్రాజెక్ట్. వర్డ్ క్లాస్ గ్రాఫిక్స్, ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.

Exit mobile version