Site icon TeluguMirchi.com

Jatadhara Trailer : భూతాల ప్రపంచంలోకి సుధీర్ బాబు – ‘జటాధార’ ట్రైలర్‌తో గూస్‌బంప్స్!

Jatadhara
Jatadhara Trailer : సుధీర్ బాబు హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్‌నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ‘జటాధార’ నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మిథాలజికల్ థ్రిల్లర్ ను జీ స్టూడియోస్, ఉమేష్ కే.ఆర్. బంసల్, శివిన్ నారంగ్ మరియు ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన టీజర్, ప్రమోషనల్ సాంగ్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసారు.

ట్రైలర్ విషయానికొస్తే, పురాతన కాలంలో సంపదను దాచడానికి “పిశాచ బంధనం” అనే ఘోర మంత్రాన్ని ఉపయోగించేవారు. ఇది ఆ సంపదను కాపాడేందుకు రాక్షసాత్మల్ని ఆహ్వానించే మంత్రం. ఐతే భూతాలు లేవని నిరూపించాలనుకునే ఒక స్కెప్టిక్ ఘోస్ట్ హంటర్, ఒకరి లోభం కారణంగా ఈ బంధనాన్ని భంగం చేస్తాడు. దీంతో “ధన పిశాచి” అనే శాపగ్రస్త దయ్యం మేల్కొంటుంది. ఒక చిన్నారి బలి జరగబోతోందన్న భయంకర కలతో, ఆ హంటర్ ఒక దుష్ట శక్తిని అడ్డుకోవడానికి బయలుదేరుతాడు. ఈ నేపథ్యంలో సృష్టి, వినాశనానికి ప్రతిరూపమైన శివుడి దివ్యశక్తి ఆవిర్భావం చూపించారు.

చివర్లో సుధీర్ బాబు నేలపై రక్తం త్రాగుతూ తపస్సులోకి వెళ్ళే సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక సోనాక్షి సిన్హా ధన పిశాచి గా అదరగొట్టగా, అవసరాల శ్రీనివాస్, శిల్పా శిరోద్కర్ పాత్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీ, రాజీవ్ రాజ్ సంగీతం సినిమాకు గ్రాండ్ ఫీల్ ఇచ్చాయి. మొత్తానికి ట్రైలర్ ప్రేక్షకులకు ఒక టెర్రిఫిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందనే చెప్పొచ్చు.

Exit mobile version