Site icon TeluguMirchi.com

Suriya 47 Story Leak: సూర్య 47’ స్టోరీ లీక్.. ఇదే అసలు ట్విస్టా?

Suriya

Suriya 47 Story Leak: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సక్సెస్ తో మంచి జోష్‌లో ఉన్న హీరో సూర్య.. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో డైరెక్టర్ జితు మాధవన్‌తో కలిసి చేస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సూర్య 47’గా పిలుస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ‘సూర్య 47’ కథకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన రూమర్ వైరల్‌గా మారింది. ఈ ప్రచారం ప్రకారం.. సినిమాలో సూర్య ఓ ధైర్యవంతుడైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారట. ఓ కీలకమైన కేసును ఛేదించే క్రమంలో ఆయన తన చూపును కోల్పోతారట. అయితే చూపు పోయినప్పటికీ కేసును వదిలిపెట్టకుండా, తన అనుభవం, పరిశీలనా శక్తిపై గేమ్స్ఆధారపడి దర్యాప్తును కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది.

కొన్నేళ్ల తర్వాత అదే కేసు మళ్లీ ఆయన ముందుకు వస్తుందని, ఈసారి డిటెక్టివ్స్‌గా నజ్రియా, నస్లెన్‌ పాత్రలు కీలకంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వీరితో కలిసి సూర్య ఆ కేసును మరోసారి ఛేదించేందుకు రంగంలోకి దిగుతారట. చూపు లేకపోయినా తన తెలివితేటలు, ఇన్‌స్టింక్ట్‌తో నేరస్తులను పట్టుకునే పోలీస్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వైరల్ అవుతున్న ఈ కథపై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజంగా ఈ సినిమా కథేనా? లేక సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన రూమరా? అనేది తెలియాల్సి ఉంది. సూర్య-జితు మాధవన్ కాంబినేషన్‌పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ వార్త ప్రస్తుతం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Exit mobile version