
Suriya 50: తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిలిచే 50వ చిత్రంపై రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ మైలురాయి చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో, ఏఆర్ మురుగదాస్ కథతో తెరకెక్కించే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన టాక్ కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో సూర్య పోషించిన ‘రోలెక్స్’ పాత్రకు స్పిన్‌ఆఫ్‌గా ‘సూర్య 50’ తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ‘ఖైదీ 2’ కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో లోకేష్ ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ సినిమాలో కొన్ని నిమిషాల పాటు కనిపించిన రోలెక్స్ పాత్ర ప్రేక్షకులను, ముఖ్యంగా సూర్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డ్రగ్ కింగ్‌పిన్‌గా అత్యంత క్రూరమైన యాంటీ – హీరో పాత్రలో సూర్య కనిపించిన తీరు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే పాత్ర చుట్టూ పూర్తి స్థాయి కథను రూపొందిస్తే.. అది సూర్య కెరీర్‌లోనే అత్యంత వైల్డ్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సూర్య ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో తన 49వ చిత్రాన్ని చేస్తున్నారు. సోషల్ – యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సూర్య 50వ చిత్రంపై వస్తున్న రకరకాల వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘రోలెక్స్’ సోలో మూవీ నిజంగా LCUలో భాగంగా తెరకెక్కుతుందా? లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే సూర్య 50 ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
