Site icon TeluguMirchi.com

Vishwanath And Sons: తిరువనంతపురంలో ఈ రోజు సూర్య సందడి.. గ్రాండ్‌గా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్!

Vishwanath And Sons

Vishwanath And Sons: తమిళ – తెలుగు ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ సినిమాను కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా సూర్య పాత్ర, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సూర్య స్టైలిష్ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సూర్య అభిమానులతో పాటు సినిమా లవర్సన్ తాజా ట్రైలర్‌పై పోస్టులు, మీమ్స్ రూపంలో వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్‌ను కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తిరువనంతపురంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు అమెరికాలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తుంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో కూడా సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version