Site icon TeluguMirchi.com

The Paradise: ‘ది ప్యారడైజ్’పై కావాలనే విషం చిమ్మారు.. నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

The Paradise

The Paradise: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఒక జాతి మనుగడ కోసం సాగే పోరాట నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదల సమయంలో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక నిరాశపరిచింది. ఈ పరాజయంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు నడుస్తుండగా, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమాను కావాలనే కొందరు టార్గెట్ చేసి దెబ్బతీశారంటూ ఆయన చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ ‘ది ప్యారడైజ్’ ఫలితంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే కొందరు పక్కా ప్లాన్‌తో నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. “ఒక సినిమా వస్తే దాన్ని ఆదరించాల్సింది పోయి, విడుదలైన మొదటి రోజే పనిగట్టుకుని ఎందుకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి చేసిన మరో కామెంట్ ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ గురించి నెగెటివ్‌గా ఏమీ రాయొద్దని పైకి నీతులు చెప్పిన వ్యక్తులే.. తెరవెనుక ఉండి ఆ పని చేశారని ఆయన బాంబ్ పేల్చారు. పరిశ్రమలోనే ఉంటూ తోటి వాళ్ల సినిమాలను ఇలా అడ్డగోలుగా తొక్కేసే ప్రయత్నం చేయడం ఏంటని ఆయన నిలదీశారు. కథ, కాన్సెప్ట్ పరంగా యూనిక్ పాయింట్‌తో వచ్చిన ఒక సినిమాను ప్రేక్షకుల వరకు పూర్తిగా వెళ్లకుండానే, సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీని రుద్దడం వల్లే కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడిందనేది తమ్మారెడ్డి మాటల సారాంశం. మరి ఈ నెగెటివ్ ప్రచారం వెనుక ఉన్న ఆ వ్యక్తులు ఎవరనే దానిపై ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.

Exit mobile version