
Mirai Sequel : ‘హనుమాన్’ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తేజ సజ్జా, ఇప్పుడు తన కొత్త సినిమా ‘మిరాయ్’ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో తేజ శక్తివంతమైన యోధుడిగా కనిపించగా, మంచు మనోజ్ యాంటాగనిస్ట్ పాత్రతో మరింత హైప్ తీసుకొచ్చాడు. విడుదలైన రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో మిరాయ్ దూసుకెళ్తోంది. అంతేకాదు క్లైమాక్స్‌లో మంచి లీడ్ ఇచ్చి ‘మిరాయ్’ సీక్వెల్ అనౌన్స్ చేసారు. ఈ సినిమా సీక్వెల్ కి ‘మిరాయ్ జైత్రయా’ అనే టైటిల్ ప్రకటించడంతో పాటు, విలన్‌గా రానా దగ్గుబాటి ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం ప్రేక్షకుల్లో భారీ ఎక్సైట్మెంట్ కలిగించింది.
ఇక తేజా సజ్జా ప్రస్తుతం ‘జై హనుమాన్’ లో నటిస్తుండగా, ఇటీవల ‘జాంబీ రెడ్డి 2’ కూడా అధికారికంగా ప్రకటించారు. వరుసగా సీక్వెల్స్‌తో బిజీ అవుతున్న తేజా, ముందుగా జై హనుమాన్, జాంబీ రెడ్డి సీక్వెల్స్‌ను పూర్తి చేయనుండగా, తర్వాత ‘మిరాయ్ జైత్రయా’ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో తేజా సజ్జా ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో హాట్ టాపిక్‌గా మారాడు.
