Site icon TeluguMirchi.com

TFTDDA By Election Results : చిరంజీవి వద్దన్నా వినకుండా ఎన్నికలు.. డాన్సర్స్ అసోసియేషన్‌లో తీవ్ర దుమారం!

Cinema

TFTDDA By Election Results : తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, టాలీవుడ్ పెద్దల సూచనలను పక్కనపెట్టి నిర్వహించిన ఈ ఎన్నికలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కార్మిక శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్, లీగల్ అడ్వైజర్ వి. సామ్రాట్ అశోక్ కుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి) G. బాలకృష్ణ (బాలు. G – కార్డ్ నెం. 426) 68 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆయనకు 91 ఓట్లు రాగా, ప్రత్యర్థి B. శ్రీనివాస్ గౌడ్ (లడ్డు శ్రీను – కార్డ్ నెం. 77)కు 23 ఓట్లు మాత్రమే లభించాయి. ట్రెజరర్ (కోశాధికారి) P.ఇశ్రాయేలు (తడివేలు – కార్డ్ నెం. 212) 79 ఓట్లు సాధించి, 34 ఓట్లు పొందిన G. వీరస్వామిపై 45 ఓట్ల వ్యత్యాసంతో గెలుపొందారు. మహిళా కమిటీ సభ్యులుగా K. నిరంజని (కార్డ్ నెం. 234 – 79 ఓట్లు), CH. సాయి లక్ష్మి (కార్డ్ నెం. 325 – 65 ఓట్లు) విజేతలుగా నిలవగా, పోటీలో ఉన్న T. శ్రావణ సంధ్యకు 59 ఓట్లు వచ్చాయి.

ఏకగ్రీవంగా ఎన్నికైన బాధ్యులు:
ఉపాధ్యక్షుడు: G. శంకర్ (కార్డ్ నెం. 53)

జాయింత్ర సెక్రటరీ: P. నాగ మల్లేశ్వర్ రావు (కార్డ్ నెం. 481)

ఆర్గనైజింగ్ సెక్రటరీ: G. రవితేజ (బన్ని – కార్డ్ నెం. 481)

ఈసీ కమిటీ సభ్యులు: P. కన్నయ్య (కార్డ్ నెం. 177), M. రమేష్ (చరణ్ – కార్డ్ నెం. 500), M. రాములు (కార్డ్ నెం. 531), B. వెంకన్న (కార్డ్ నెం. 415).

ఈ ఉప ఎన్నికల నిర్వహణ చుట్టూ పరిశ్రమలో పెద్ద ఎత్తున వివాదం ముదిరింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులు ప్రస్తుత వాతావరణంలో ఉప ఎన్నికలు వద్దని వారించినప్పటికీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్ష నిర్ణయంతో ముందుకు వెళ్లారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్‌లో 600 మందికి పైగా సభ్యులు, 502 మంది ఓటర్లు ఉన్నప్పటికీ, కేవలం 114 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడం (2 ఓట్లు చెల్లకుండా పోయాయి) గమనార్హం. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ సహా మెజారిటీ డాన్స్ మాస్టర్లు, సభ్యులు ఈ పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. పెద్దల మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఎన్నికలు జరిపినందుకు ప్రెసిడెంట్ సుమలత తీరుపై ఫెడరేషన్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు వ్యతిరేక వర్గం సన్నాహాలు చేస్తోంది.

Exit mobile version