
Jananayagan: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటించిన మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. సంచలన దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, తమిళనాడు సీఎం పీఠాన్ని అధిష్టించిన కొద్ది నెలలకే ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
నిజాయితీ గల ఒక మాజీ పోలీసు అధికారి.. సత్యం, వ్యవస్థపై నియంత్రణ కోసం జరిపిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుందని తెలుస్తోంది. విజయ్ రియల్ లైఫ్ పొలిటికల్ జర్నీకి, ఆయన స్క్రీన్ లెగసీని కలుపుతూ 183 నిమిషాల (3 గంటల 3 నిమిషాలు) రన్‌టైమ్‌తో ఒక ఎపిక్ పొలిటికల్ డ్రామాగా హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని మలిచారట. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, ప్రమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో మిలియన్లకు పైగా వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. విదేశాల్లో దళపతి క్రేజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. యూకే (UK) లోని ప్రముఖ సినీ నెట్‌వర్క్ ‘సినీవరల్డ్’లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం ఒక గంటలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. యూకేతో పాటు ఫ్రాన్స్, కెనడా, ఐరోపా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తూ గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సీఎం హోదాలో థియేటర్లలోకి వస్తున్న విజయ్ చివరి సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
