Site icon TeluguMirchi.com

SIIMA Awards 2026: సైమా 2026లో ‘OG’ తాండవం.. పవన్ కళ్యాణ్ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ కొట్టిన తమన్!

SIIMA

SIIMA Awards 2026: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దే కాల్ హిమ్ OG’ బాక్సాఫీస్ వద్దే కాదు.. అవార్డుల వేదికపైనా తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2026 వేడుకల్లో ‘OG’ ఆల్బమ్‌కు గానూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ అవార్డును దక్కించుకున్నారు. బెంగళూరు వేదికగా అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో తమన్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.

‘OG’ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా థియేటర్లలో ప్రేక్షకులను ఊర్రూతలూగించే మాస్ బీట్స్‌ను అందించారు ఆయన. సోనీ మ్యూజిక్ ఇండియా ద్వారా విడుదలైన ఈ చిత్రంలోని ‘ఫైర్‌స్టార్మ్’, ‘గన్స్ ఎన్ రోజెస్’ వంటి ట్రాక్స్ మ్యూజిక్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి నెట్టింట సరికొత్త రికార్డులను సృష్టించాయి. ముఖ్యంగా థియేటర్లలో తమన్ అందించిన రీ-రికార్డింగ్ పవన్ ఎలివేషన్ సీన్లకు ప్రాణం పోసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సైమా వేదికపై తమన్ పేరు మారుమోగడంతో సోషల్ మీడియాలో ‘OG’ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో తెరకెక్కనున్న ‘OG’ సీక్వెల్‌తో తమన్ మరిన్ని అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version