
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ క్లైమాక్స్‌కు సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం మేకర్స్ చిత్రీకరిస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ మరో పది రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ ఫైట్‌కు ప్రముఖ ఫైట్ కొరియోగ్రాఫర్ నవకాంత్ మాస్టర్ యాక్షన్ కంపోజ్ చేస్తున్నారని సమాచారం. కథలో అత్యంత కీలకంగా నిలిచే ఈ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందించేలా యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిన వెంటనే చిత్ర బృందం స్పెషల్ సాంగ్ షూట్‌ను స్టార్ట్ చేయనుందని చెబుతున్నారు. ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ అయిపోతే సినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి కానుందట. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి సినిమాను రిలీజ్‌కి సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
