Site icon TeluguMirchi.com

The Paradise: బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ఒక్క రోజులోనే 3.2 లక్షల టికెట్లు!

ThePARADISE

The Paradise: బాక్సాఫీస్ వద్ద మరోసారి ‘న్యాచురల్ స్టార్’ విధ్వంసం మొదలైంది. వైవిధ్యమైన కథలతో మార్కెట్‌ను విస్తరించుకుంటూ పోతున్న నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదల ముంగిట సంచలన గణాంకాలతో వార్తల్లో నిలిచింది. ప్రీమియర్స్ సమయానికి ముందే బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తూ బుక్‌మైషో ప్లాట్‌ఫామ్‌పై ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 24 గంటల్లోనే ఏకంగా 3.21 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఇండస్ట్రీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నాని కెరీర్‌లోనే ఇది అపూర్వమైన అడ్వాన్స్ బుకింగ్ జోరుగా నిలిచిందని చెబుతున్నారు.

నేటి ప్రీమియర్స్‌తోనే భారీ ఓపెనింగ్స్ ఖాయమని తేలిపోగా, రేపటి నుంచి పాన్ ఇండియా స్థాయిలో పూర్తిస్థాయి రిలీజ్ ఉండటంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ ఖాయంగా కనిపిస్తోంది. అనిరుధ్ సంగీతం, ఎస్ ఎల్ వి సినిమాస్ రాజీ పడకుండా ఖర్చు పెట్టిన నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మరింత పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోనూ బుకింగ్స్ జోరు చూస్తుంటే ‘ది ప్యారడైజ్’ మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. ప్రీమియర్స్ టాక్ గనుక పాజిటివ్‌గా వస్తే, ఈ వారాంతానికి సరికొత్త బెంచ్‌మార్క్ నమోదు కావడం ఖాయం.

Exit mobile version