
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకురాగా, ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ నాని కెరీర్‌లోనే కాకుండా ఈ చిత్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి సన్నివేశాన్ని ఎలాంటి రాజీ పడకుండా, అత్యంత శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెల తీసుకుంటున్న కేర్, ప్రతి ఫ్రేమ్‌ను గ్రాండ్‌గా మలచాలనే ప్రయత్నం చిత్రబృందం పనితీరులో స్పష్టంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కథ, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులను కొత్త అనుభూతికి తీసుకెళ్తాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘ఆయా షేర్’ కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ పాట ఇప్పటికే 200 మిలియన్ల వ్యూస్ సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ రికార్డు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నాని కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచిన ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అన్న ఆసక్తి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా నెలకొంది.
Thank you for 200M+ for #AayaSher ❤️#TheParadiseTeaser Soon 🤗#TheParadise pic.twitter.com/Y5zIsamTD8
— Srikanth Odela (@odela_srikanth) July 26, 2026
