Site icon TeluguMirchi.com

The Paradise: ‘ది ప్యారడైజ్’ కాదు.. అసలు టైటిల్ ‘సమ్మక్క’ పెట్టాల్సింది: నాని

The Paradise

The Paradise: న్యాచురల్ స్టార్ నాని నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చులా రేగుతోంది. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, తాజాగా నాని చేసిన ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ సినిమాపై ఉన్న హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది.

ఇటీవల జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ అడిగిన ప్రశ్నకు నాని అదిరిపోయే సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కి ‘ది ప్యారడైజ్’ అనే పేరు కాకుండా మరో టైటిల్ ఆలోచించాల్సి వస్తే ఏకంగా ‘సమ్మక్క’ అనే పెట్టాల్సి వచ్చేదని, అసలు కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ నిజంగానే ‘సమ్మక్క’ అని పెట్టి ఉంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయమంటూ నాని వ్యాఖ్యానించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో నాని తల్లి పాత్రను ప్రముఖ నటి సొనాలి కులకర్ణి పోషించారు. కథను నడిపించే అత్యంత ప్రభావవంతమైన ఎమోషనల్ పిల్లర్‌గా ఈ క్యారెక్టర్ నిలవనుంది.

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాయదు లోహర్ కథానాయికగా అలరించనుండగా, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు ప్రధాన ఆయువుపట్టుగా మారనున్నాయి. కేవలం హీరో ఎలివేషన్లతో మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే బలమైన మదర్ సెంటిమెంట్‌తో శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత లోతైన కథను తెరకెక్కించినట్లు నాని మాటలతో స్పష్టమవుతోంది. తాజా కామెంట్స్‌తో సెప్టెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం నమోదు కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version