Site icon TeluguMirchi.com

The Paradise: ‘ది ప్యారడైజ్’ నైజాం టికెట్ రేట్ల పెంపు ఖాయం!

The Paradise

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కి సమయం దగ్గరపడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద టికెట్ ధరల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచేందుకు నిర్మాతలు దరఖాస్తు చేసుకోగా, తాజాగా నైజాం ప్రాంతంలో టికెట్ హైక్స్ దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి బలమైన సమాచారం బయటకు వచ్చింది.

నైజాంలో టికెట్ ధరల పెంపునకు లైన్ క్లియర్ కావడం వెనుక ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సైబర్ క్రైమ్ మోసాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా చిత్ర బృందం తరఫున నేచురల్ స్టార్ నాని ఓ ప్రత్యేక అవగాహన వీడియోను రూపొందించి విడుదల చేశారు. ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వానికి మద్దతుగా నాని ఈ వినూత్న అడుగు వేయడంతో, సినిమా టికెట్ ధరల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారిక జీవో (GO) బయటికి రావడమే మిగిలి ఉంది.

యంగ్ సెన్సేషన్ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. విడుదల ముంగిట నైజాంలో టికెట్ రేట్ల పెంపు దాదాపు ఖాయం కావడంతో, ఓపెనింగ్స్ పరంగా సినిమా సరికొత్త రికార్డులను సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. అధికారిక ఉత్తర్వులు రాగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను భారీ స్థాయిలో స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version