Site icon TeluguMirchi.com

Akhanda 2 : ‘అఖండ 2’ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం – అప్పుడు బ్రదర్స్.. ఇప్పుడు సిస్టర్స్!

Akhanda2
Akhanda 2 : గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను ల పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2: తాండవం’ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజాను రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన స్పందనను రాబట్టింది. తాజాగా విడుదలైన ‘బ్లాస్టింగ్ రోర్ గ్లింప్స్’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది.

ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి నెక్స్ట్ లెవల్ ఎనర్జీని ఇస్తోంది. సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, పండిట్‌ అతుల్‌ మిశ్రా సోదరుల వాయిస్‌లతో గూస్‌బంప్స్ స్కోర్ రికార్డ్ కాగా, ఇప్పుడు సర్వేపల్లి సిస్టర్స్ తమ డివైన్ వోకల్స్ తో థమన్ స్కోర్‌కి మేజికల్ టచ్ ఇచ్చారు. ఈ చిత్రంలో సంయుక్తా ప్రధాన పాత్రలో నటించగా, ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ రోల్‌లో, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. సి. రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

Exit mobile version