Site icon TeluguMirchi.com

Sai Durgha Tej: టాలీవుడ్‌లో మెగా జోరు.. ఇప్పుడు సాయి దుర్గ తేజ్ వంతు!

Sai Durgha Tej

Sai Durgha Tej: తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హవా కొనసాగుతోంది. వరుస విజయాలతో మెగా హీరోలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో అభిమానులతో పాటు మెగా అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. ఒకరి తర్వాత ఒకరు సాలిడ్ హిట్స్ అందుకుంటుండటంతో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ప్రతి సినిమాపై ఆసక్తి నెలకొంటోంది. ఇటీవల రామ్ చరణ్ భారీ అంచనాల మధ్య వచ్చిన ‘పెద్ది’తో మంచి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’తో తన కెరీర్‌లోనే రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేసి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన సుదీర్ఘ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఇదే జోరును వరుణ్ తేజ్ కూడా కొనసాగించారు. ‘కొరియన్ కనకరాజు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇలా మెగా హీరోల సినిమాలు వరుసగా సక్సెస్ అందుకుంటుండటంతో టాలీవుడ్‌లో ‘మెగా వేవ్’ కొనసాగుతోందనే చర్చ ట్రేడ్ వర్గాల్లో మొదలైంది. ఇప్పుడు ఈ సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించే బాధ్యత సాయి దుర్గ తేజ్‌పై పడిందని చెబుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాను అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సంబరాల ఏటిగట్టు’ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే.. మెగా ఫ్యామిలీ వరుస విజయాల జోరు మరింత హాట్ టాపిక్‌గా మారనుంది. దీంతో ఇప్పుడు ‘నెక్స్ట్ సాయి దుర్గ తేజ్’ అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version