
Toxic Huge Opening: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్‌కు కూడా అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్‌ను పరిశీలిస్తున్న ట్రేడ్ నిపుణులు ‘టాక్సిక్’ భారీ ఓపెనింగ్ సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా తొలి రోజు రూ.125 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకునే దిశగా ఈ సినిమా టికెట్స్ సేలింగ్ సాగుతోందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే యశ్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా ఇది భారీ రికార్డుగా నిలిచే అవకాశం ఉందట.
ఇక హిందీ మార్కెట్‌లోనూ ‘టాక్సిక్’పై భారీ క్రేజ్ కనిపిస్తోంది. తొలి రోజే హిందీ వెర్షన్ రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నార్త్ ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ వేగం పెరగడంతో ఈ అంచనాలకు మరింత బలం చేకూరుతోంది. ఇప్పటికే యశ్ నటించిన ‘KGF: Chapter 2’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘టాక్సిక్’ ఆ స్థాయి ఓపెనింగ్‌ను అందుకుంటుందా? అనే ఆసక్తి సినిమా ప్రేక్షకుల్లో నెలకొంది. అంతేకాదు, 2026లో భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్: ది రివెంజ్’కు కూడా ‘టాక్సిక్’ గట్టి పోటీ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్, ట్రేడ్ అంచనాల ఆధారంగా వినిపిస్తున్న లెక్కలే. సినిమా విడుదలైన తర్వాతే ‘టాక్సిక్’ అసలు బాక్సాఫీస్ సత్తా ఏమిటో స్పష్టమవుతుంది.
