
Varanasi: భారతీయ చలనచిత్ర పరిశ్రమ సరిహద్దులను చెరిపేస్తూ గ్లోబల్ బాక్సాఫీస్‌పై మరోసారి దండయాత్రకు సిద్ధమవుతున్నారు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’. ఈ చిత్రానికి సంబంధించి సినీ ప్రియులను ఉర్రూతలూగించే అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ‘రుద్ర’ అనే అత్యంత శక్తిమంతమైన మైథలాజికల్ యాక్షన్ పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబుకు సంబంధించిన పూర్తి షూటింగ్ పార్ట్‌ను జక్కన్న సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేశారట. సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ సాగుతుందనే ముద్ర ఉంది. అయితే గతంలో సంచలనం సృష్టించిన ‘RRR’ ప్రధాన షూటింగ్ కంటే అత్యంత వేగంగా ఈ సినిమా మహేష్ పోర్షన్‌ను కొలిక్కి తేవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. తన పార్ట్ షూట్ ముగియడంతో మహేష్ బాబు ప్రస్తుతం షార్ట్ బ్రేక్ తీసుకొని వెకేషన్‌కు పయనమయ్యారని తెలుస్తుంది.
ఏకంగా రూ. 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత ఐమ్యాక్స్ సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పురాణ గాథలను, ప్రపంచ స్థాయి హై-స్టేక్స్ యాక్షన్‌ను మేళవించి జక్కన్న తీర్చిదిద్దుతున్న ఈ విజువల్ వండర్‌లో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వచ్చే వారం ఓ పవిత్ర పుణ్యక్షేత్రంలో చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేయడంతో షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటుందని అంటున్నారు. ఇక ఈ గ్లోబల్ యాక్షన్ జాతరను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మహేష్ – రాజమౌళి కాంబోలో వస్తున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
