Site icon TeluguMirchi.com

Korean Kanaka Raju: థియేటర్లలోకి ‘కొరియన్ కనక రాజు’.. ఓటీటీ డీల్ క్లోజ్!

Korean Kanaka Raju

Korean Kanaka Raju: మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొరియన్ కనక రాజు’. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండు కీలక అప్‌డేట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆగస్ట్ 7న గ్రాండ్ రిలీజ్
ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. జూన్ మూడో వారంలో ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసి ప్రమోషన్ల జోరు పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయట. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని విభిన్నమైన కథాంశం, వరుణ్ తేజ్ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వాములు మంచి డీల్‌ను కుదుర్చుకున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీ రిలీజ్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ కెరీర్‌లో తొలిసారిగా పూర్తి స్థాయి కామెడీ – హారర్ జానర్‌లో వస్తున్న సినిమా కావడంతో, ‘కొరియన్ కనక రాజు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version