Site icon TeluguMirchi.com

VenkyAnil5: సీమ బ్యాక్‌డ్రాప్‌లో వెంకీ మామ, కళ్యాణ్ రామ్ రచ్చ.. అనిల్ రావిపూడి ప్రమోషన్ ప్రోమో చూశారా!

VenkyAnil5

VenkyAnil5: టాలీవుడ్‌లో వరుస విజయాలతో ‘హిట్ మెషిన్’గా గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరో సంచలనానికి తెరలేపారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో అనిల్ ఒక భారీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మైండ్ బ్లోయింగ్ అనౌన్స్‌మెంట్ వీడియో ఒకటి విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సరికొత్త ప్రమోషనల్ వీడియోలో కేవలం హీరోలే కాకుండా చిత్ర హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ కూడా కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతిలో కత్తి పట్టుకుని, రక్త తిలకం దిద్దుకుంటూ ఇచ్చిన ఎంట్రీ నవ్వులు పూయిస్తోంది. ఎంత సీరియస్ ఎలిమెంట్‌నైనా తనదైన శైలిలో ఎంత హిలేరియస్‌గా మార్చవచ్చో అనిల్ ఈ వీడియోతో మరోసారి నిరూపించారు.

ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో వెంకీ మామ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి సందడి చేయబోతోంది. ఈ చిత్రానికి వైవిధ్యభరితమైన సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. జీ స్టూడియోస్, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోలో ఈ సినిమాను రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అద్భుతమైన ఫ్యామిలీ అండ్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం అయ్యింది. సీమ నేపథ్యంలో అనిల్ మార్క్ కామెడీ ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. సాధారణంగా వెండితెరపై రాయలసీమ అనగానే ‘ఫ్యాక్షన్, నరకాలు, బాంబులు, కత్తులు’ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, అనిల్ రావిపూడి ఈసారి ఆ పాత ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాయబోతున్నారనేది చాలా ఆసక్తిగా మారింది. ఈ నవ్వుల పండగను సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Exit mobile version