![]()
Vicky Kaushal: ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ పౌరాణిక చిత్రం ‘మహావతార్’ (Mahavatar) తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇందులో విక్కీ కౌశల్ పురాణాల్లో మహా యోధుడు, ఋషిగా ప్రసిద్ధి చెందిన పరశురాముడు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. పరశురాముడి పాత్ర కోసం విక్కీ కౌశల్ 25 కిలోలకు పైగా బరువు పెరగనున్నారట. ఇందుకోసం ప్రత్యేక ఫిట్‌నెస్ ట్రైనింగ్‌తో పాటు కఠినమైన డైట్‌ను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం సెప్టెంబర్‌లో ప్రత్యేక శిక్షణ ప్రారంభం కానుండగా, డిసెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విభిన్న పాత్రల కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకుంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విక్కీ కౌశల్, ఇప్పుడు ‘మహావతార్’ కోసం మరో భారీ సవాల్‌ను స్వీకరించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. పౌరాణిక కథాంశంతో అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విక్కీ కౌశల్ ట్రాన్స్‌ఫర్మేషన్, షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
