Site icon TeluguMirchi.com

Bhadrakaali Trailer : పొలిటికల్ థ్రిల్లర్ గా ‘భద్రకాళి’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్!!

Bhadrakaali
Bhadrakaali Trailer : విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భద్రకాళి’ ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే రాజకీయ నేపథ్యంగా జరిగే కథలాగే కనిపిస్తుంది. అవినీతి, ఆర్థిక దోపిడీ, వ్యవస్థల నిర్లక్ష్యం, పేదరికం, రాజకీయం లాంటి అనేక అంశాల చుట్టూ కథ తిరుగుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. “తప్పు చేసినోడు భయపడాలా? నష్టపోయిన వాడు భయపడాలా?” వంటి డైలాగ్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

అద్భుతమైన విజువల్స్, విజయ్ ఆంటోనీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘అరువి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, స్రవంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. తృప్తి రవీంద్ర, చంద్రశేఖర్, సునీల్ కృపలాని, మాస్టర్ కేశవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేస్తున్నాయి. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, ఈసారి పొలిటికల్ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.

Exit mobile version