Site icon TeluguMirchi.com

Nanna Kutty: పక్కా హిట్ కొట్టే ప్లాన్‌తో విజయ్ ఆంటోనీ.. ‘నాన్న కుట్టి’తో ఆ రోజే ఎంట్రీ!

Nanna Kutty

Nanna Kutty: వైవిధ్యమైన కథలతో, విలక్షణమైన పాత్రలతో దక్షిణాది సినీ ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. కంటెంట్ ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆయన నుంచి సరికొత్త ప్రాజెక్ట్ వస్తుందంటేనే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ మొదలవుతుంది. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ చిత్రం ‘నాన్న కుట్టి’ బాక్సాఫీస్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే ఇది మరో ప్రత్యేకమైన సినిమాగా నిలవబోతోందని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. టైటిల్, పోస్టర్ డిజైన్ చూస్తుంటే ఎమోషన్, థ్రిల్ సమపాళ్లలో మేళవించిన బలమైన స్టోరీతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. విజయ్ ఆంటోనీ మార్క్ మైండ్‌గేమ్స్, సెంటిమెంట్ కలగలిపి ఈసారి థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్.. నటనతో పాటు విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించడం. విజయ్ ఆంటోనీ తన సొంత సినిమాలకు స్వరాలు సమకూర్చిన ప్రతిసారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఏ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ట్యూన్స్ సినిమాకు ప్రాణంగా నిలవబోతున్నాయని సమాచారం. దర్శకుడు ము మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కిస్తున్నారు. ప్రీతి, హరిప్రియ హీరోయిన్స్‌గా నటిస్తూ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘విజయ్ ఆంటోనీ ఫిలింస్’ సొంత బ్యానర్‌పై రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 16న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version