Site icon TeluguMirchi.com

Bhadrakaali : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్

Bhadrakaali
Bhadrakaali : ‘మార్గన్’ విజయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో రాబోతున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వంలో, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ మంచి స్పందన పొందగా, తాజాగా విడుదలైన ‘జిల్ జిల్’ సాంగ్ హై ఎనర్జీతో ఆకట్టుకుంటోంది. భోలే షావలి రాసి పాడిన ఈ పాటకు విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందించడం విశేషం. విజువల్స్ సినిమాపై ఆసక్తి మరింత పెంచాయి.

ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, తృప్తి రవీంద్ర, రియా జితు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి పని చేస్తుండగా, షెల్లీ కాలిస్ట్ డీవోపీగా, రేమండ్ డెరిక్ ఎడిటర్‌గా, రాజశేఖర్ ఫైట్ మాస్టర్‌గా పనిచేశారు. తెలుగులో ‘మార్గన్’ సినిమాను విజయవంతం చేసిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తోంది. అదనంగా, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండటంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ నెలకొంది. సెప్టెంబర్ 19న విడుదల కానున్న ‘భద్రకాళి’ విజయ్ ఆంటోనీ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే అవకాశం ఉందని సినిమా యూనిట్ నమ్మకంగా చెప్పింది.

Exit mobile version