Site icon TeluguMirchi.com

Jason Sanjay: హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయ్ వారసుడు?

Jason Sanjay

Jason Sanjay: తమిళ చిత్రసీమలో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. తమిళనాట తిరుగులేని స్టార్‌డమ్‌తో పాటు రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న దళపతి విజయ్ కుటుంబం నుంచి ఊహించని బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆయన కుమారుడు జేసన్ సంజయ్ త్వరలోనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జేసన్ సంజయ్ గతంలో ‘సిగ్మా’ సినిమాతో డైరెక్టర్‌గా పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. తెరవెనుక ప్రతిభ చాటిన ఈ యంగ్ ట్యాలెంట్.. ఇప్పుడు నేరుగా హీరోగా మారి కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. తండ్రి ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ లాంచ్‌తోనే సంజయ్ వెండితెరకు పరిచయం కానున్నాడన్న టాక్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంజయ్ డెబ్యూ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో సంజయ్ డైరెక్ట్ చేసిన ‘సిగ్మా’ను నిర్మించిన ఈ సంస్థే, ఇప్పుడు ఆయనను హీరోగా ప్రెజెంట్ చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తోందని వినికిడి. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రముఖ కమర్షియల్ దర్శకుడు లింగుసామితో పాటు పలువురు టాప్ డైరెక్టర్లు చెప్పిన కథలను నిర్మాతలు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ లాంచింగ్ చిత్రానికి సంజీవ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటూ సరికొత్త ప్రచారం ఊపందుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దళపతి వారసుడి అరంగేట్రం ఖరారైతే కోలీవుడ్‌లో సరికొత్త రికార్డుల వేట మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version