Site icon TeluguMirchi.com

Actor Vishal: తమిళనాడు సీఎం విజయ్ పేరుతో ముగ్గురు పేద విద్యార్థినులకు చదువు! ఎవరు చదివిస్తున్నారో తెలుసా?

Vishal

Actor Vishal: తమిళనాడు సీఎం విజయ్‌ను ఆయన పాత స్నేహితుడు హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. లోయోలా కాలేజ్ రోజుల్లో మొదలైన తమ పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ, సోషల్ మీడియా వేదికగా విశాల్ ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ విజయ్‌లో ఏమాత్రం మార్పు రాలేదని, అదే పాత స్నేహపూర్వక ఆత్మీయతను కనబరిచారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

“కాలేజ్ రోజుల్లో ఒక బడ్డింగ్ స్టార్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, అన్ని రకాల విమర్శలు, అడ్డంకులను తన మౌనంతో, విజయాలతో తిప్పికొడుతూ ‘సూపర్‌స్టార్’ స్థాయికి ఎదిగిన విజయ్‌ను చూడటం గర్వంగా ఉంది. ఇప్పుడు తమిళనాడు గౌరవనీయ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పదవులు, హోదాలు మారినా.. ‘విజయ్’ అనే వ్యక్తి మాత్రం మారలేదు. అందుకే ఇప్పటికీ ఆయనను ఎప్పటిలాగే ‘డార్లింగ్’ అని పిలవడానికి నేను ఏమాత్రం సంకోచించలేదు” అంటూ పేర్కొన్నారు. తాను కలైంజ్ఞర్ కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌లను కూడా చూశానని.. కానీ తన సొంత స్నేహితుడైన సీఎంను ‘డార్లింగ్’ అని పిలవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, తనలోని ఫ్యాన్‌బాయ్ ఎప్పటికీ అలాగే ఉంటాడని ఎమోషనల్ అయ్యారు.

ఈ భేటీలో ఒక అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ముఖ్యమంత్రులను కలిసినప్పుడు బొకేలు, శాలువాలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే, సీఎం విజయ్ ఆ సంప్రదాయాన్ని సున్నితంగా తిరస్కరించారు. దీనిని గౌరవిస్తూ, హీరో విశాల్ ఆ బొకేలు, శాలువాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును.. తమిళనాడుకు చెందిన ముగ్గురు పేద ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం విరాళంగా ఇచ్చారు. సీఎం విజయ్ పేరు మీదనే ఈ ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version