
Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు జంతువులంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమెకు కుక్కలంటే అమితమైన ప్రేమ. తరచూ తన పెట్స్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా త్రిష పెంచుకుంటున్న ఒక క్యూట్ డాగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్‌ను కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ బయటపెట్టాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హీరో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. “ఈ విషయాన్ని నేను ఇప్పటివరకు ఎక్కడా, ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పలేదు. మొదటిసారి ఇక్కడే రివీల్ చేస్తున్నాను. ప్రస్తుతం త్రిష దగ్గర ఉన్న ఒక పూడుల్ (Poodle) జాతికి చెందిన కుక్కపిల్ల మరెవరిదో కాదు.. నా దగ్గర ఉన్న ‘టెడ్డీ’ అనే పెంపుడు కుక్క కూతురే! నా భార్య జ్వాలా గుత్తా, త్రిష ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ కలిసినప్పుడల్లా ఎక్కువగా ఈ పెట్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ సీక్రెట్ లీక్ చేసినందుకు త్రిష ఎక్కడ ఫీల్ అవుతుందోనని ఫన్నీగా వ్యాఖ్యానించాడు. “త్రిష పర్సనల్ విషయానికి సంబంధించిన ఈ చిన్న సీక్రెట్‌ను నేను ఇలా ఓపెన్‌గా చెప్పేసినందుకు త్రిష నొచ్చుకోదని, తప్పుగా అనుకోదని భావిస్తున్నాను” అంటూ విష్ణు విశాల్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ మారింది.
