Site icon TeluguMirchi.com

Vishwambhara: ‘విశ్వంభర’ ఫైనల్ అవుట్‌పుట్ అదిరిపోయిందట.. రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

Vishwambhara

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ వర్క్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి ‘విశ్వంభర’కు సంబంధించిన రీ-రికార్డింగ్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌కు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చిందని, ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో చిత్రబృందం సంతృప్తిగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ విజువల్స్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా నిలవనుండటంతో.. రీ-రికార్డింగ్ పూర్తవడం చిత్రబృందానికి ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు.

అయితే టెక్నికల్ పనులు దాదాపు పూర్తవుతున్నప్పటికీ.. సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. దీనికి ప్రధాన కారణం ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ ఇంకా లాక్ కాకపోవడమేనని సమాచారం. డిజిటల్ రైట్స్‌కి సంబంధించిన చర్చలు పూర్తయ్యి డీల్ ఫైనల్ అయిన తర్వాతే థియేట్రికల్ రిలీజ్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ దృష్టి మొత్తం బిజినెస్ వ్యవహారాలపైనే ఉన్నట్లు సమాచారం. ఓటీటీ డీల్ సెటిల్ అయిన వెంటనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాక్. దీంతో మెగాస్టార్ అభిమానులు ‘విశ్వంభర’ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుండగా.. కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి.

Exit mobile version