Site icon TeluguMirchi.com

ZEE5 : 7 భాషల్లో భారీ కంటెంట్ లైనప్ ప్రకటించిన ZEE5..

ZEE5

ZEE5 : భారతీయ ఓటీటీ రంగంలో ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏడు భారతీయ భాషల్లో తెరకెక్కుతున్న భారీ మల్టీ-లాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను ప్రకటిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కంటెంట్, యానిమేషన్, పిల్లల వినోద కార్యక్రమాలతో ఈ లైనప్‌ను రెడీ చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా ZEE5 భారీ సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. నివేదా థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘శ్రీమతి’, శ్రీకాంత్ నటిస్తున్న ‘అబ్జెక్షన్ మై లార్డ్’ వంటి ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు, ప్రేక్షకాదరణ పొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షో కొత్త సీజన్‌తో తిరిగి రానుంది. అలాగే థియేట్రికల్ రిలీజ్ అనంతరం స్ట్రీమింగ్‌కు రానున్న NBK111, వెంకీ అనీల్5, వృషకర్మ వంటి భారీ తెలుగు సినిమాలు కూడా ZEE5లో అందుబాటులోకి రానున్నాయి.

హిందీలో ‘కాంబ్లీ’, ‘ది స్కామ్ లీక్డ్’, ‘కాఫీ కింగ్’ వంటి కొత్త వెబ్ సిరీస్‌లతో పాటు పలు ప్రముఖ ఫ్రాంచైజీల కొత్త సీజన్లు రానున్నాయి. అలాగే వరుణ్ ధావన్, పూజా హెగ్డే, కంగనా రనౌత్, బాబీ డియోల్, మృణాల్ ఠాకూర్ తదితరుల చిత్రాలు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలో ‘కూసే మునిసామి వీరప్పన్’, ‘అనంతకాలం’, ‘తీ కురల్’ వంటి ఒరిజినల్స్‌తో పాటు ‘డి మాంటే కాలనీ 3’, నయనతార నటిస్తున్న ‘హై’ వంటి చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే కథలతో ప్రత్యేక కంటెంట్‌ను ZEE5 సిద్ధం చేసింది. ఈ భారీ కంటెంట్ లైనప్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియోస్, మ్యాడాక్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర ప్రముఖ నిర్మాణ సంస్థలతో ZEE5 భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ZEE5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ.. ట్రెండ్స్‌ను అనుసరించడం కాకుండా వాటిని సృష్టించడమే తమ లక్ష్యమని తెలిపారు. భాషలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను అందించేందుకు ఈ అతిపెద్ద కంటెంట్ లైనప్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందించే స్వదేశీ ఓటీటీ వేదికగా ZEE5ను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version