
ZEE5: ఎప్పటికప్పుడు వినూత్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించి అలరిస్తూ జీ5 పిల్లలకు ఇష్టమైన కంటెంట్‌ను అందించేలా కిడ్స్ జెడ్ (KidZ).. కంటెంట్‌ను డిజైన్ చేసే ప్రదేశంగా మారింది. తాజాగా జీ5 లో సరికొత్త యానిమేటెడ్ సిరీస్ ‘శివలోక్ కె కుండక్క మండక్క’ (SKM) ప్రారంభమైంది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇది జూలై 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మన అందరికీ తెలిసిన పౌరాణిక ప్రపంచాన్ని ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా స్క్రీన్‌పై సరికొత్తగా అందించనున్నారు.
కథ విషయానికి వస్తే.. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట చుట్టూ తిరుగుతుంది. వాళ్ల అల్లరి పనులు ధైర్యం, స్నేహం, తమను తాము తెలుసుకునే ఒక అద్భుతమైన అడ్వెంచర్‌లోకి తీసుకెళ్తాయి. రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలకే పరిమితం కాకుండా, ఈ సిరీస్ భారతీయ పౌరాణిక సంపదలోని కొత్త పాత్రలు, ఇంకా అన్వేషించని లోకాలు, మాయాజాలంతో నిండిన అడ్వెంచర్లను పిల్లలకు, కుటుంబాలకు పరిచయం చేయనుంది. వినోదం, యాక్షన్, ఆకర్షణీయమైన యానిమేషన్ కలయికతో రూపొందిన ఈ సిరీస్ నేటి పిల్లల కోసం పౌరాణిక కథలను సరికొత్తగా ఆవిష్కరించనుంది. హీరో అనే పదం ఓ వ్యక్తి తను తీసుకునే నిర్ణయాలతో నిర్ణయించబడుతాడనే అభిప్రాయాన్ని అందంగా అందరికీ తెలియజేస్తుంది. ఇదొక పెద్ద యూనివర్స్‌కు ఆరంభం మాత్రమేనని మేకర్స్ పేర్కొన్నారు. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ భవిష్యత్తులో కొత్త పాత్రలు, కొత్త అడ్వెంచర్లు, మరిన్ని కథలతో విస్తరించే ప్రపంచానికి పునాది వేస్తుందని చెప్పారు.
KidZ ద్వారా ZEE5.. కుటుంబం మొత్తం కలిసి చూసేలా రూపొందించిన ఈ సిరీస్, వినోదంతో పాటు పిల్లలు, తల్లిదండ్రులను ఒకే చోట కూర్చుని ఎంజాయ్ చేసేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ సిరీస్ హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ సందర్భంగా కిడ్స్ జెడ్(KidZ) జీ5 బిజినెస్ హెడ్ చందన్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “జీ5లో తరతరాలుగా ప్రేమించబడుతూ వచ్చిన కథలే నిజంగా చిరస్థాయిగా నిలుస్తాయని నమ్ముతాం. అలాంటి కథలను నేటి పిల్లలకు చేరవేయడానికి ఆనంద్ నీలకంఠన్ వంటి ప్రముఖ కథాకర్తలతో కలిసి పని చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘శివలోక్ కె కుండక్క మండక్క’ ద్వారా ఇప్పటికే తెలిసిన పౌరాణిక కథలకంటే ముందుకు వెళ్లి, కొత్త పాత్రలు, హాస్యం, సాహసం, విలువలతో నిండిన కొత్త ప్రపంచాన్ని కుటుంబాలకు పరిచయం చేయాలనేదే మా ఉద్దేశం. భారతీయ పౌరాణిక సంపదను ఆకట్టుకునే కథనంతో, ఉన్నతమైన యానిమేషన్‌తో కలిపి, వినోదంతో పాటు అర్థవంతమైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాం. ఈ సిరీస్ పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఆస్వాదించేలా ఉంటుంది. కిడ్స్ జెడ్‌ను మరింత విస్తరించుకుంటూ, భారతీయ కథలను కొత్త కోణంలో చెప్పగల క్రియేటర్లతో భాగస్వామ్యం అవుతూ, అన్ని భాషలు, తరాలకు దగ్గరయ్యే స్వదేశీ ఫ్రాంచైజ్‌లను నిర్మించడమే మా లక్ష్యం” అన్నారు.
రైటర్ ఆనంద్ నీలకంఠన్ మాట్లాడుతూ “నా పుస్తకం ‘ ది వెరీ, ఎక్స్‌ట్రీమ్లీ, మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ను ‘శివలోక్ కె కుండక్క మండక్క’ రూపంలో కిడ్స్ జెడ్ జీవం పోసి కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడం చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. భారతీయ పౌరాణిక సంపదలో నాటుకుపోయిన కథలను పిల్లలకు ఆకట్టుకునే విధంగా మళ్లీ ఆవిష్కరించడం..వాటిని జీ5 వంటి పెద్ద స్థాయి ప్లాట్‌ఫార్స్ రూపొందించటం ప్రోత్సాహకరంగా ఉంది. నేను ఈ పాత్రలను సృష్టించినప్పుడు ఎంత ఆనందించానో, కుండక్క, మండక్కల అడ్వెంచర్లను స్క్రీన్‌పై చూస్తూ చిన్నారులు కూడా అంతే ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ అల్లరి పాత్రలు వారి ప్రపంచం యానిమేషన్ రూపంలో కొత్త జీవం పొందడం నిజంగా ఆనందించదగ్గ విషయం” అన్నారు.
