Site icon TeluguMirchi.com

Network : సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నెట్‌వర్క్’ – నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్!

Network
Network : తెలుగు ప్రేక్షకులకు క్యాలిటీ కంటెంట్ అందించడంలో ముందుండే ఆహా ఓటీటీ మళ్లీ కొత్తగా ‘నెట్‌వర్క్’ అనే ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను అందిస్తోంది. శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కి సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలు క్రియేట్ చేయగా, ఆన్లైన్ డిపెండెన్స్‌, ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌, ఆన్లైన్ డేటింగ్‌, ఆన్లైన్ ఇన్ఫ్లూయెన్సింగ్ వంటి నాలుగు ట్రాక్స్‌తో ‘నెట్‌వర్క్’ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తూ అనూహ్య మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ సిరీస్‌లో తాగుబోతు రమేష్‌, సమ్మెట గాంధీ, జోష్ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్, ఫన్ బకెట్ భార్గవి, పద్మంజలి, జబర్దస్త్ ఫణి లాంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రల్లో కనిపించనుండటం విశేషం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అందించిన సంగీతం సిరీస్‌కు మరో హైలెట్‌గా నిలవనుంది. “మనం డైరెక్షన్స్ ఇస్తే పని చేయాల్సిన వస్తువు.. మన లైఫ్‌ని డైరెక్ట్ చేయకూడదు” అనే డైలాగ్ నెట్‌వర్క్ యొక్క లోతైన అంశాలను ప్రతిబింబిస్తుంది. టెక్నికల్‌గా బ్రిలియంట్‌గా రూపొందిన ఈ సిరీస్ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్‌ ఎంగేజింగ్ థ్రిల్లర్ అనుభవించాలంటే ‘నెట్‌వర్క్’ మిస్ కాకండి.

Exit mobile version