
Epic OTT Release: ‘బేబీ’ వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి తెరపై మెరిస్తే చూడాలని ఎదురుచూసిన యూత్‌కు ఎపిక్ సినిమాతో ఆ కల నిజం అయ్యింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన భావోద్వేగాలు, రొమాంటిక్ డ్రామాతో యువతరం మనసులను కొల్లగొట్టిన చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. థియేటర్లలో యూత్‌ఫుల్ వైబ్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ రొమాంటిక్ రైడ్, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో డీల్ కుదుర్చుకుని స్ట్రీమింగ్ డేట్‌ను సైతం ఫిక్స్ చేసుకుంది.
ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా పాన్-ఇండియా రేంజ్‌లో తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్‌కు తీసుకువస్తుండటం విశేషం. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలుకానుండటంతో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎపిక్ సరికొత్త వ్యూవర్‌షిప్ రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
