
Maremma OTT Release: మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన కొత్త కుర్రాడు మాధవ్. రవితేజ తమ్ముడి కొడుకుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆయన చేసిన ఫస్ట్ మూవీ ‘మారెమ్మ’. ఈ సినిమా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకొని, ప్రస్తుతం సైలెంట్‌గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ల్యాండ్ అవ్వడానికి రెడీ అయ్యింది.
రూరల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. వెండితెరపై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే డిజిటల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసేశారు మేకర్స్. ‘ఆహా’లో అక్టోబర్ 9 నుంచి ఈ చిత్రం అధికారికంగా స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం.. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అదే రోజు నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
