Site icon TeluguMirchi.com

Mothevari Love Story : ‘గిబిలి గిబిలి’ పాటతో సిప్లిగంజ్ మ్యాజిక్ మళ్లీ ట్రెండ్ లోకి!

Mothevarylovestory
Mothevari Love Story : భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ZEE5లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఓ వినోదాత్మక ప్రేమ కథ ‘మోతెవరి లవ్ స్టోరీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా తెరకెక్కించారు. మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మించిన ఈ విలేజ్ కామెడీ లవ్ స్టోరీ మొత్తం ఏడు ఎపిసోడ్స్‌గా ఆగస్ట్ 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ ద్వారా ఇది గ్రామీణ ప్రేమకథకు హాస్యాన్ని సమ్మేళనం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలవబోతోందని స్పష్టమైంది.

తాజాగా ఈ సిరీస్‌లోని ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో హీరో, హీరోయిన్‌కు తన ప్రేమను వ్యక్తం చేస్తూ కనిపిస్తాడు. అందుకే భావోద్వేగంతో పాటు, హాస్యాన్ని సమపాళ్లలో కలగలిపేలా ఈ పాట నిలిచింది. ముఖ్యంగా, సోషల్ మీడియాలో యువత ఉపయోగించే ట్రెండింగ్ పదాలను చక్కగా జోడించడం పాటకు ఆకర్షణగా మారింది. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాటకు మల్లెగోడ గంగప్రసాద్ సాహిత్యాన్ని రచించారు. రాహుల్ సిప్లిగంజ్ స్వరం ఈ పాటకి ప్రాణం పోసింది. శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ, అనిల్ గీలా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Exit mobile version