Site icon TeluguMirchi.com

Rao Bahadur: రేపే ఓటీటీలోకి ‘రావు బహదూర్’.. స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

Rao bahadur review

Rao Bahadur: సత్యదేవ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. వెంకటేష్ మహా రచన, దర్శకత్వం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

అంతరించిపోతున్న అభిజాత్య వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించారు. వికాస్ ముప్పాల, దీపా థామస్, బాలా పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. “Doubt is a Deadly Demon” అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం సస్పెన్స్, డార్క్ కామెడీ, మ్యాజికల్ రియలిజం అంశాలను మేళవిస్తూ ఓ విభిన్న అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. గతంలోనే జీవిస్తూ ఉండిపోయిన ఓ రాజవంశీకుడి జీవితాన్ని స్టోరీగా చేసుకుని కథ సాగుతుంది. మానసిక సంఘర్షణలు, అనుమానాలు మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని డైరెక్టర్ వెండి తెరపై ఆసక్తికరంగా చూపించారు. విభిన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘రావు బహదూర్’ మంచి ఛాయిస్‌గా నిలవొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

Exit mobile version